రష్యాతో యుద్ధం విషయంలో ఉక్రెయిన్ దేశానికి నాటో కూటమి అండగా నిలిచింది. రష్యాతో ఎడతెరపి లేకుండా పోరును కొనసాగిస్తున్న ఉక్రెయిన్ కు సైనిక, మానవతా సాయం అందించడంలో వెనకడుగు వేయబోమని నాటో కూటమి ప్రకటించింది. రష్యాతో యుద్ధం ఎంతకాలం సాగినా సరే, ఉక్రెయిన్ కు తమ మద్దతు కచ్చితంగా ఉంటుందని వెల్లడించింది. యుద్ధ క్షేత్రంలో జరిగే పరిణామాలపైనే శాంతి చర్చలు ఆధారపడి ఉంటాయని నాటో అభిప్రాయపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యాతో శాంతి చర్చలు జరపాలని ఉక్రెయిన్ పై ఎలాంటి ఒత్తిడి తీసుకు రాలేమని నాటో కూటమి స్పష్టం చేసింది.