గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సర్వే ఉద్యోగులను గ్రేడ్-3 నుంచి గ్రేడ్-2కి మార్చేందుకు సీఎం జగన్ అంగీకరించారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. దీంతో 11 వేల మందికి లబ్ధి కలగనుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల డీఏ బకాయిలు జనవరిలో ఇచ్చేందుకు, ఏప్రిల్ లో సచివాలయ సిబ్బంది బదిలీలకు సీఎం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.