ఏపీ లోని B.Ed కళాశాలలు లోపాలను సరిచేసుకునేందుకు సంబంధిత యూనివర్సిటీలు మరో నెల రోజులు గడువు ఇచ్చాయి. సదుపాయాలు, క్వాలిఫైడ్ లెక్చరర్లు లేరని 120 B.Ed కాలేజీలకు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఆ కాలేజీలు కోర్టుకు వెళ్లడంతో కౌన్సెలింగ్ ను ఈ నెల 15 వరకు వాయిదా వేశారు. నెల రోజుల్లో ఈ లోపాలను పరిష్కరిస్తేనే ఆ కాలేజీలను సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి అనుమతించనున్నారు.