కరోనా కష్టకాలం తర్వాత చాలా మంది ఆన్ లైన్ కోర్సులు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. విద్యాసంస్థలు, వర్సిటీలు కూడా ఆన్ లైన్ లో కోర్సులు అందిస్తుండడంతో వీటికి డిమాండ్ పెరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా 'స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టింగ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్' (https://swayam.gov.in/) ఏర్పాటు చేసి వందలాది కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఐటీలు కూడా https://nptel.ac.in/ ద్వారా ఆన్ లైన్ కోర్సులను అందిస్తోంది. ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలోనూ ఆన్ లైన్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు ఇలా చాలా మంది ఆన్ లైన్ కోర్సులు నేర్చుకుని తమ నైపుణ్యాలను పెంచుకుంటున్నారు.