భారతీయ యువతలో నైపుణ్యం పెంచే దిశగా ఎడ్ టెక్ సంస్థ ‘నెక్స్ట్ వేవ్’, గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ నేతృత్వంలో $33 మిలియన్లను సేకరించినట్లు మంగళవారం తెలిపింది. ఈ నిధులతో. భవిష్యత్తులో యువతలో పరిశ్రమ సంబంధిత నైపుణాలు, వారికి ఉద్యోగావకాశాలు మెరుగుపడేలా శిక్షణనిస్తామని సంస్థ సీఈవో రాహుల్ అట్లూరి తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ‘నెక్స్ట్ వేవ్’ ఏఐతో పాటు సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ, ఫుల్ స్టాక్ వంటి కోర్సుల్లో యువతకు శిక్షణనిస్తోంది.