గాజువాక హౌస్ కమిటీ సమస్య పూర్తిగా పరిష్కారమయ్యింది. ఎన్నో ఏళ్లుగా గాజువాక ప్రాంతాన్ని పట్టి పీడుస్తున్న సమస్య 4 దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోలేదు అని ప్రజలు మంగళవారం తెలిపారు. ఇది కేవలం పెద్దలు గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మరియు గాజువాక వైఎస్సార్సీపీ ఇంచార్జీ దేవన్ రెడ్డి కృషి ఫలితం అని చెప్పవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతి సారి తాడేపల్లి వెళ్ళినపుడు అంతా గాజువాకకి ఈ సమస్య ఎప్పటినుంచో ఉంది, ఇది ఎలా అయినా త్వరగా క్లియర్ చేయాలి అని కోరారు. దాని ఫలితంగా ఈ జీ. ఓ నంబర్ 71 రిలీజ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కృషితో గాజువాక ప్రజల కళ నేటికి నెరవేరింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి గాజువాక ప్రజలు దన్యవాదాలు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, తిప్పల దేవన్ రెడ్డి లకి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. సర్వే నంబరు 86, 87, 274 హైస్కూలు రోడ్ , కణితిరోడ్ , బానోజీతోట ప్రాంతాలలో 30 ఎళ్ళుగా పట్టి పీడిస్తున్న సమస్య నేటికి వీడింది. ఇప్పటి నుండి హౌస్ కమిటీలో వున్న ఇళ్ళు భూములు క్రయవిక్రయాలకు, రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినది .
ఈ కార్యక్రమంలో గాజువాక వైఎస్సార్సీపీ ఇంచార్జీ తిప్పల దేవన్ రెడ్డి , డీసీఎంఎస్ చైర్మన్ పల్లా చిన్న తల్లి , విశాఖ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీ రెడ్డి , రాష్ట్ర మైనారిటీ సెక్రటరీ మహమ్మద్ గౌస్, ఇంటక్ మంత్రి రాజ్ శేఖర్, కార్పొరేటరలు మహమ్మద్ ఇమ్రాన్, ఊరుకుటి చందు, నరసింహ పాత్రుడు, రాజాన రామారావు, ఇళ్లపు వరలక్ష్మి ప్రసాద్, భూపతిరాజు సుజాత, మర్టుపుడి పరదేశి, వార్డ్ ఇంచార్జీ ధర్మాల శ్రీను, బోగాధి సన్నీ, కోమటి శ్రీనివాస్, రోజా రాణి, గాజువాక సోషల్ మీడియా టీం, బొడ్డ గోవింద్, చిత్రాడ వెంకట్ రమణ, మద్దాల అప్పారావు, సౌకత అలీ, మంత్రి శంకర రావు, రంబా సత్యనారాయణ, జుత్తు లక్ష్మి, తిప్పల స్వాతి రెడ్డి, తాడి వరలక్ష్మి, ఇంకా ముఖ్య మరియు సీనియర్ నాయకులు, సచీవాలయం కన్వినర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.