కివీ పండులో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం ముడుతలు పడకుండా కాపాడుతుంది. కివీ పండులోని పొటాషియం కంటెంట్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. పక్షవాతం, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ పండు తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కివీ పండులో ఉండే సెరటోనిన్ వల్ల హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇది మేలు చేస్తుంది.