ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 109 పరుగులకే కుప్పకూలింది. భారత టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. రోహిత్(12), గిల్(21), పుజారా(1), జడేజా(4), శ్రేయస్(0), కోహ్లీ(22), భరత్(17, అశ్విన్(3), సిరాజ్(0), అక్షర్(12*) పరుగులు చేశారు. చివర్లో ఉమేశ్ యాదవ్(17) రెండు సిక్సర్లు కొట్టడంతో టీమిండియా స్కోరు 100 పరుగులు దాటింది. కున్హెమాన్ 5, లియాన్ 3, మర్ఫీ ఒక వికెట్ తీశారు.