అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 495 పాయింట్ల లాభంతో 59,405 దగ్గర, నిఫ్టీ 153 పాయింట్లు లాభపడి 17,475 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.27 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో SBI, టాటా స్టీల్, NTPC, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.