గత కొన్నిరోజులుగా లాభాలలో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోకి చేరాయి. నేడు భారీ నష్టాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 308 పాయింట్లు నష్టపోయి 59,916 వద్ద ట్రేడింగ్ ప్రారంభించగా, నిఫ్టీ 81 పాయింట్ల నష్టంతో 17,629 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.14గా ఉంది. మారుతి, హిందుస్తాన్ యూనిలివర్, ఎల్ అండ్ టీ కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి.