దేశవ్యాప్తంగా ఈ ఏడాది నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల నిర్వహణకు ఎన్ సీటీఈ ఆమోదం తెలిపింది. 57 ప్రముఖ జాతీయ, రాష్ట్ర ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీకాం బీఈడీ కోర్సులు నిర్వహిస్తారు. ఇంటర్ తర్వాత ఉపాధ్యాయ విద్య చదవాలనుకున్న వారు ప్రవేశాలు పొందొచ్చు. ఈ సమీకృత కోర్సుతో ఏడాది ఆదా అవుతుంది. ఎన్ టీఏ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.