‘స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్’ (ఎస్ క్యూఎల్) డేటాను అన్ని విధాలుగా నిర్వహించడంలో ఇది ప్రధానంగా ఉపయోగపడుతుంది. స్టార్టప్స్ నుంచి పెద్ద స్థాయి కంపెనీల వరకూ ఎస్ క్యూఎల్ నిపుణులు అవసరం. బీఈ, బీటెక్, ఎంసీఏ, ఐటీ సంబంధిత డిగ్రీ, పీజీ కోర్సులు చేసిన వారు ఆఫ్ లైన్/ఆన్ లైన్ లో దీన్ని నేర్చుకోవచ్చు. ఇండీడ్ సంస్థ తాజా నివేదికల ప్రకారం ఎస్ క్యూఎల్ డెవలపర్ సగటు జీతం ఏడాదికి రూ.4 లక్షల వరకూ ఉంటుంది.