ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 13న కోస్తాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. దీంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మూడు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. ఈ నెల 11 సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు మూసేయాలని విశాఖపట్నం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు.