చాలామందికి ఎంటర్ టైన్మెంట్ అంటే ఆసక్తి. అలాగే, ఎడ్యుకేషన్, ఎంటర్ టైన్మెంట్ కలగలిపిన పద్ధతిలో నేర్చుకునే సరికొత్త విధానమే ఎడ్యుటైన్మెంట్. ఈ విధానాన్ని అమెరికన్ విద్యావేత్తలు తొలిసారిగా ప్రతిపాదించారు. విద్యార్థులు ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు కథలు, చిత్రాలు, బోర్డ్ గేమ్స్, వీడియో గేమ్స్ ఇలా సరదా అంశాలను చేర్చి వాటిపై ఆసక్తి పెంచుతారు. విద్యార్థులు మరింత ఇష్టంగా నేర్చుకునేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశం.