త్రిపుర పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి అమిత్ షా కాన్వాయ్‌లోకి ఓ కారు దూసుకెళ్లిన ఘటన అలజడి సృష్టించింది. నిన్న సాయంత్రం గెస్ట్ హౌస్ నుంచి అగర్తల విమానాశ్రయానికి అమిత్ షా కాన్వాయ్ వెళ్తుండగా ఆ మార్గంలో అధికారులు సాధారణ ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఓ వ్యక్తి మాత్రం ఆగకుండా తన కారుతో దూసుకొచ్చాడు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అతడు ఆగలేదు. అయితే ఈ ఘటన వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa