మహిళా దినోత్సవం రోజే ఓ మహిళపై బీజేపీ ఎంపీ దురుసుగా ప్రవర్తించారు. కర్ణాటక, కోలార్ జిల్లాకు చెందిన BJP ఎంపీ మునిస్వామి బుధవారం ఒక ఎగ్జిబిషన్‌కు హాజరయ్యారు. అక్కడి స్టాళ్లను సందర్శిస్తుండగా, ఓ బట్టల వ్యాపారి బొట్టులేకుండా ఎంపీ కంటపడటంతో ఫైర్ అయ్యారు. ‘‘ముందు బొట్టు పెట్టుకో, మీ భర్త బతికే ఉన్నాడు కదా. కామన్ సెన్స్ లేదా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారటంతో వివాదాస్పదమైంది.