బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ తో నాలుగో టెస్టు ఆడుతున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ నడుము నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బీసీసీఐ శ్రేయస్ ను మెడికల్ స్కాన్ కోసం పంపినట్లు సమాచారం. గాయం పెద్దదైతే శ్రేయస్ నాలుగో టెస్టుకు దూరమయ్యే అవకాశాలున్నాయి. శ్రేయస్ గాయంపై బీసీసీఐ అధికారికంగా స్పందించాల్సి ఉంది.