ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జట్టు రాలడానికి కారణం ఇవి కూడా కావచ్చు

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Mar 19, 2023, 08:14 PM

వయసు మీదపడిన తర్వాత.. మహిళలకు జుట్టు రాలే సమస్య సర్వసాధారం. ఎందుకంటే, వయసు పెరిగే కొద్దీ.. వాళ్లను అనారోగ్యాలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. అయితే, ఈ మధ్యకాలంలో టీనేజర్లు, హెయిర్‌ ఫాల్‌ గురించి ఎక్కువగా కంప్లైంట్‌ చేస్తూ ఉంటున్నారు. ఇది పిల్లలను మాత్రమే కాదు, తల్లిని కూడా ఆందోళనకు గురిచేస్తుంది. రోజుకు.. కొంచెం జుట్టు ఊడిపోవడమే కామన్‌. కానీ, తలలో వేళ్లు పెట్టిన వెంటనే, దువ్వెనతో దువ్విన వెంటనే.. పాయపాయలుగా జుట్టు ఊడుతుంటే.. కంగారు మొదలవుతుంది. అమ్మాయిలు హెయిర్‌ ఫాల్‌ సమస్యను దురం చేసుకోవడానికి.. ఏవేవో హెయిర్‌ ప్యాక్‌లు, రెమిడీస్‌ ట్రై చేస్తూ ఉంటారు. కానీ, టీనేజ్‌లో జుట్టు రాలడం వెనకు కారణాలు తెలుసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణాలు గుర్తించి, నివారణలు తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. చిన్నవయస్సులో జుట్టు రాలడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.​


కొన్నిసార్లు జన్యు పరమైన కారణాల వల్ల.. జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆండ్రోజెనెటిక్ అలోపేసియా, ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ వంటి జన్యుపరమైన కారణాల వల్ల జుట్టు రాలుతుంది. ఈ కండీషన్స్‌లో జుట్టు రాలుతూ.. క్రమేపీ పలుచబడుతుంది. ఇది సాధారణంగా.. 30, 40 లో కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో టీనేజ్‌లోనూ ఈ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.


టీనేజ్ అమ్మాయిలు.. ఎక్కువగా లుక్స్‌, బరువు మీద దృష్టి పెడుతూ ఉంటారు. దీంతో తక్కువ తినడం, క్రాష్ డైటింగ్ వంటివి పాటిస్తారు. దీని కారణంగా జీర్ణ సమస్యలు కూడా రావచ్చు. ఇవన్నీ హెయిర్‌ గ్రోత్‌కు సహాయపడే.. ఐరన్, విటమిన్ B12, విటమిన్ D, జింక్, బయోటిన్, ప్రొటీన్‌ వంటి పోషకాల లోపానికి దారితీస్తాయి. హెయిర్‌ ఫాల్‌తో బాధపడే టీనేజ్‌ అమ్మాయిలు.. పోషకాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


(పురుష హార్మోన్లు) ఉత్పత్తవుతుంటాయి. ఫలితంగా హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతుంటాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత చర్మం, జుట్టు నిర్మాణ కణజాలాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. జింక్‌ సప్లిమెంట్స్‌, జింక్‌ ఎక్కువగా లభించే కోడిగుడ్లు, చేపలు, నట్స్‌, గింజలు.. వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల పీసీఓఎస్‌ ఉన్నవారిలో జుట్టు రాలే సమస్య దూరం అవతుందని నిపుణులు అంటున్నారు.


థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి పెరగినా, తగ్గినా.. జుట్టు పెలుసుగా మారడం, హెయిర్‌ ఫాల్‌ ఎక్కువగా ఉండటం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.


టీనేజ్‌ అమ్మాయిలు హెయిర్ కలరింగ్‌, స్ట్రెయిటెనింగ్ అంటే చాలా ఇష్టపడతారు. కానీ, రెగ్యులర్‌గా హెయిర్ కలరింగ్, స్ట్రెయిటెనింగ్, స్మూత్నింగ్ వంటి కెమికల్‌ ట్రీట్మెంట్స్‌ తీసుకుంటుంటే.. హెయిర్ షాఫ్ట్ డైసల్ఫైడ్ బాండ్స్‌ విచ్ఛిన్నం అవుతాయి. దీని కారణంగా జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. ఇది హెయిర్‌ ఫాల్‌ సమస్యను పెంచుతుంది.


వేడి నీటితో తలస్నానం చేయడం, కఠినమైన షాంపూలు వాడటం, జుట్టు తడిగా ఉన్నప్పుడు జడ వేసినా.. జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com