కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య శుక్రవారం సతీ సమేతంగా వాడరేవులో సముద్ర స్నానం ఆచరించారు. అనంతరం తీరంలో కార్తీక పూజలు చేశారు. సముద్ర స్నానాలకు వచ్చే భక్తులకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్ల గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవాంఛనీయ సంఘటన లేవీ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు. టిడిపి నేత పిక్కి నారాయణ తదితరులు పాల్గొన్నారు