ఒకప్పుడు పత్రికలు, పుస్తకాలు, టీవీలు సమాచార మాధ్యమాలు. ఇప్పుడు సోషల్ మీడియా మరో ప్రత్యామ్నాయ మాధ్యమంగా మారింది. ఎవరితోనైనా సులభంగా కనెక్ట్ కావొచ్చు. కమ్యూనికేషన్ అనేది వేగంగా మారిపోయింది. ప్రధానమంత్రికి కూడా సామాజిక మాధ్యమాల ద్వారా వినతులను పంపిస్తే, తిరిగి సమాధానాలు అందుకున్న సంఘటనలను చూశాం. అయితే కొంతమంది మాత్రం సోషల్ మీడియాను తప్పుగా వాడుతున్నారు. అలాగే ఫోర్త్ ఎస్టేట్‌పై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతోంది. సోషల్ మీడియాపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్)లో యనమల రామకృష్ణుడు ట్వీట్ చేశారు.