రఘురామకృష్ణంరాజు (ట్రిపుల్ ఆర్)ను డిప్యూటీ స్పీకర్‌గా నియమించే ప్రక్రియను అడ్డం పెట్టుకుని, కూటమి పార్టీలన్నీ కలిసి శాసనసభ స్థాయిని దిగజార్చే విధంగా మాజీ సీఎం వైయస్ జగన్‌పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయని గుంటూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు.
రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతల స్వీకరణ సందర్భంగా నాలుగు మంచి మాటల ప్రస్తావనకు బదులు, ఆయన అరెస్టు అంశాన్ని గుర్తు చేసిన చంద్రబాబు, సభలో పచ్చి అబద్ధాలు వల్లె వేశారని, అలా ఆయన దత్తపుత్రుడ పవన్‌కళ్యాణ్‌ను మించి నటించాడని అంబటి రాంబాబు తెలిపారు. రఘురామపై దేశద్రోహం కేసు పెట్టి, కస్టడీలో టార్చర్ చేశారని చంద్రబాబు ఆరోపించడాన్ని ఆయన తప్పుబట్టారు. వాస్తవానికి తనను కస్టడీలో హింసించారంటూ రఘురామ చేసిన ఆరోపణలను చివరకు సుప్రీంకోర్టు కూడా నమ్మలేదని గుర్తు చేశారు.