ఆశ వర్కర్ల సమస్యల పరిష్కరించాలని ఆ సంఘ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం విజయనగరం జిల్లా, బలిజిపేట పరిధిలోని అరసాడ పీహెచ్సీ వైద్యురాలు శివగాయత్రీకి వినతి పత్రం అందించారు. ఆశ వర్కర్లకు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. పనిభారం తగ్గించాలన్నారు. ఈనెల 18న పార్వతీపురంలో జరిగే కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.