ఈరోజు (శుక్రవారం) సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ ముద్రగడ లేఖను విడుదల చేశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకే సోషల్ మీడియా కేసులు, రెడ్ బుక్ వేధింపులు అంటూ లేఖలో ఆరోపణలు గుప్పించారు. సూపర్ సిక్స్ హామీల అమలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
అమాయకులను జైల్లో పెట్టి కొట్టించకూడదంటూ ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాగా.. సోషల్ మీడియాలో అసభ్యకరపోస్టులు పెట్టారంటూ పలువురు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలుస్తోంది. సోషల్ మీడియాలో అసభ్యకరపోస్టుల అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో ఇలాంటి పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అదుపులోకి తీసుకుంటున్నారు.