ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాల్గవ రోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముుందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎడ్యుకేషన్ కు సంబంధించి మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. 20 నుంచి 30 కిలోమీటర్ల మధ్య డిగ్రీ కళాశాల ఉండాలనేది నిబంధన అని అన్నారు. ఇంటర్మిడియట్ ఎడ్యూకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్‌కు చాలా తేడా ఉంటుందని, గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్ధులకు టెక్ట్స్ బుక్స్ కూడా ఇవ్వలేదని విమర్శించారు.
టీచింగ్‌ను బలోపేతం చేసిన విద్యార్ధులను ఎస్సెస్ చేసి కొందరికి ఫోకస్‌గా చదువు చెపుతున్నామన్నారు. ఈ ఏడాది10 శాతం ఎడ్మిషన్లు పెరిగాయన్నారు. నారాయణ కాలేజీలతో పోటీ పడేలా ఇంటర్ కాలేజీలు నడుపుతామని చెప్పారు. 9 వ తరగతి నుంచి ఇంటర్ కోసం ఓరియంటేషన్ ట్రైనింగ్ చేయాలని చెప్పారు. స్కూల్‌లకు ర్యాంకింగ్ మెకానిజం పెడదామని భావిస్తున్నామని, డిసెంబర్ మొదటి వారంలో పిటీఎం నిర్వహిస్తున్నామని.. సభ్యులు కూడా పాల్గొనాలని మంత్రి లోకేష్ అన్నారు.