నాలుగవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అయితే ఓ మంత్రి సభలో క్షమాపణలు చెప్పారు. మళ్లీ ఇంకోసారి ఇలా జరుగదు అని అన్నారు. ఇంతకీ సభలో ఏం జరిగింది.. క్షమాపణలు చెప్పిన మంత్రి ఎవరు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎందుకు క్లాస్ తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం. కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ క్షమాపణలు చెప్పారు. ఈరోజు మంత్రి సభకు ఆలస్యంగా వచ్చారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన సమయంలో ముందుగా మంత్రి వాసంశెట్టి ఓ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సి ఉంది.
అయితే ప్రశ్నోత్తరాల సమయానికి మంత్రి లేకపోవడంతో ప్రశ్న ముందుగా వాయిదా పడింది. ఆ తరువాత మంత్రి ఆలస్యంగా సభకు రావడంతో తిరిగి సభ్యులు ప్రశ్న వేశారు. అయితే ఈ విషయంపై మంత్రికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు పలు సూచలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని మంత్రిని కోరారు. మంత్రులే లేట్‌గా వస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. సకాలంలో వచ్చేందుకు మంత్రులు ప్రయత్నించాలని స్పీకర్ కోరారు. అయితే సభకు ఆలస్యంగా వచ్చినందుకు మంత్రి వాసంశెట్టి సుభాష్ క్షమాపణలు కోరారు. తిరిగి ప్రశ్నోత్తరాలు కొనసాగాయి.