మద్యం పాలసీ విధానంపై ఏపీ శాసనమండలిలో ఇవాళ(శుక్రవారం) చర్చ జరిగింది. లిక్కర్ పాలసీని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తప్పుబట్టారు. దువ్వాడ శ్రీనుకు మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు. దేశంలోనే బెస్ట్ లిక్కర్ పాలసీ ఏపీలోనే ఉందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.18వేల కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు.
లిక్కర్ రేట్లపై కమిటీ వేశామని స్పష్టం చేశారు. మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలో లిక్కర్ రేట్లు తక్కువ అని చెప్పారు. జగన్ ప్రభుత్వ లిక్కర్ పాలసీపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తి అయిందని అన్నారు. సీబీ సీఐడీ విచారణ కూడా చేస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్‌లో భారీ దోపిడీ జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. లిక్కర్ దోపిడీ వెనుక సూత్రధారులను బయటకు లాగుతామని అన్నారు. లిక్కర్ స్కాంలో ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.