దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 63 పాయింట్లు నష్టపోయి 57,862 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో 17,054 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.24 వద్ద కొనసాగుతోంది. హెచ్ సీఎల్ టెక్, టీసీఎస్, ఐటీసీ, విప్రో, టెక్ మహీంద్రా సంస్థల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.