దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. కానీ, కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 58,891 దగ్గర కొనసాగుతుండగా, నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 17,344 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.46 దగ్గర కొనసాగుతోంది. మారుతీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్, టైటన్, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.