CBSE బోర్డు పరీక్షల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా CBSE పరీక్షల క్రమంలో మార్పులు చేయాలని NSF ముసాయిదా కమిటీ ప్రతిపాదించింది. ఈ మేరకు CBSE 12వ తరగతిలో 2 టర్ముల్లో పరీక్షలు నిర్వహించే విధానం మళ్లీ రావచ్చు. అలాగే 10, 12 తరగతుల వార్షిక పరీక్షల ఫలితాల్లో గత తరగతుల మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం 11,12 తరగతుల కోసం పాఠ్యాంషాలను సైన్స్, ఆర్ట్స్/హ్యుమానిటీస్, కామర్స్‌లుగా విభజిస్తున్న విధానాన్ని కూడా తొలగించాలని కమిటీ ప్రతిపాదించింది.