టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపులు ఆగడం లేదు. ఇప్పటికే చాలా కంపెనీలు పెద్ద ఎత్తున లేఆఫ్‌లను ప్రకటించాయి. తాజాగా 19 వేల మంది సిబ్బందిని విధుల నుంచి తొలగించబోతున్నామని ప్రఖ్యాత ఐటీ సంస్థ యాక్సెంచర్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో 2.5 శాతం మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పనున్నట్టు తెలిపింది. అయితే ఈ లేఆప్స్ ఒకేసారి జరగవు. 18 నెలల వ్యవధిలో తొలగింపులు జరుగుతాయి.