అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ వాల్ట్ డిస్నీ మరోసారి ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. ఎంటర్టైన్మెంట్ విభాగంలో దాదాపు 15 శాతం మంది ఉద్యోగులను వచ్చే వారం కోత విధించనున్నట్టు సమాచారం. ఏప్రిల్ 24 నాటికి తొలగింపుల సమాచారం ఉద్యోగులకు అందబోతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 7 వేల మంది ఉద్యోగులను సంస్థ తీసివేసింది.