ఒకే దేశం - ఒకే ప్రవేశపరీక్ష విధానాన్ని అమలుచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ‘నీట్’ తరహాలోనే ఇంజినీరింగ్‌కి కూడా జాతీయస్థాయిలో ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించాలని భావిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోని బీటెక్ సీట్ల భర్తీకి జాతీయస్థాయి ప్రవేశపరీక్ష జరపాలని 2016 నుంచే కేంద్రం యోచిస్తోంది. నీట్, JEE మెయిన్‌లను కూడా CUETలో విలీనం చేయాలని, ఇది సాధ్యం కాకుంటే ఇంజినీరింగ్‌కు ప్రత్యేకంగా జాతీయ ఉమ్మడి ప్రవేశపరీక్ష జరిపే దిశగా యోచిస్తోంది.