ఎక్కువగా నీరు తాగడం ప్రమాదకరమా? నిజమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ నీరు తాగడం వల్ల ఇంట్రాక్రానియల్ ఒత్తిడిని పెంచి, మరణానికి కారణమవుతుంది. ఒక వ్యక్తి మూత్రపిండాలు నిర్వహించగలిగే దానికంటే ఎక్కువ నీరు తాగితే ఓవర్‌హైడ్రేషన్ ఏర్పడుతుంది. ఈ నీరు మన శరీర భాగాల్లో, అవయవాల్లో చాలా చేరుకొని, టాయిలెట్ ద్వారా కూడా బయటకు వెళ్లదు. ముందుగా మీ బరువును నిర్ధారించుకొని, దానిని 30 ద్వారా విభజించండి. మీ బరువు 60 అయితే 30తో భాగిస్తే 2 వస్తుంది. అంటే ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 2 లీటర్ల నీరు తాగాలి. ఎక్కువ లేదా తక్కువ నీరు శరీరానికి ప్రమాదకరమని, దీనిపై అవగాహనతో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.