వేసవి కాలంలో బయటకు వెళ్తే చర్మం కమిలిపోవడంతోపాటు నీరసం వస్తోంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎండల్లోనూ అందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు. పుదీనా ఆకులను తాగే నీటిలో కలపడం, పుదీనా టీ తీసుకోవాలి. ఉదయం గ్లాసు నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవాలి. మజ్జిగ శరీరంలో వేడిని చల్లారుస్తుంది. కొత్తిమీరను ఆహారంలో అధికంగా తీసుకోవాలి. ఆకుకూరలు, కర్బూజా, పుచ్చకాయలు, ఈత కాయలు, తాటి ముంజలు, రాగిజావ వంటివి తీసుకోవాలి.