దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 68 పాయింట్లు నష్టపోయి 60,581 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో 17,902 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.76 వద్ద కొనసాగుతోంది. అపోలో హాస్పిటల్, విప్రో, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కో, యూపీఎల్ కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి.