ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి పీఎస్జీ జట్టు షాకిచ్చింది. మెస్సీపై రెండు వారాల పాటు సస్పెన్షన్ వేటు వేసింది. సౌదీ అరేబియాలో అనధికారంగా పర్యటించడంతో మెస్సీని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు వారాల పాటు జట్టుతో ఆడకుండా, ట్రెయినింగ్ లో పాల్గొనకుండా నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి ఫీజు చెల్లింబోమని వెల్లడించింది.