సెంట్రల్ బోర్ట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) నూతన నిబంధనలను ప్రవేశపెట్టింది. రానున్న విద్యా సంవత్సరం నుండి కంపార్ట్ మెంట్, ఇంప్రూవ్ మెంట్ పరీక్షల స్థానంలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది. అలాగే ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అయిన వారు మళ్లీ థియరీ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని తెలిపింది. పాస్ కావాలంటే ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం స్కోర్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.