ప్రస్తుత రోజుల్లో చాలామంది శారీరక, మానసిక సమస్యలతో బాధ పడుతూ ఒత్తిడికి గురవుతున్నారు. మనం తీసుకునే ఆహారం, పండ్లతోనే ఒత్తిడిని దూరం చెయ్యొచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అరటి, బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీలు యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉండి అధిక ఒత్తిడిని దూరం చేస్తాయంటున్నారు. నారింజలోని విటమిన్ సి ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితి మెరుగుపరుస్తుంది. పైనాపిల్ స్ట్రెస్ తగ్గించడం సహా డిప్రెషన్ ప్రమాదాన్ని నివారిస్తుంది.