ఉదయాన్నే చాలామందికి కాఫీ, టీ తాగడం అలవాటు. అయితే, కొంత మంది పాలతో కాకుండా పాలపొడితో వీటిని చేసుకుని తాగుతుంటారు. దీంతో చాలా అనారోగ్య సమస్యలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది బరువును పెంచడమే కాక గుండె ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన పాలపొడి వల్ల డయాబెటిస్ రోగులకు రక్తంలో చక్కెర్ స్థాయి పెరుగుతుందంటున్నారు. అధిక కొలెస్ట్రాల్ కు కారణమవుతుందని చెబుతున్నారు.