ఏ సీజన్ లోనైనా వచ్చేది సాధారణ జ్వరం. కొన్ని ఇంటి చిట్కాలతో దీన్ని తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అధికంగా జ్వరం వస్తే సన్నని బట్ట గానీ, టవల్ గానీ నీటిలో ముంచి నుదుటిపై ఉంచాలి. ఓ స్పూన్ అల్లం వేడి నీటిలో మరిగించి ప్రతి 3 గంటలకోసారి తాగాలి. అలాగే, తాజా తులసి ఆకులను ఉదయం నమలాలి. నీళ్లలో ఓ టేబుల్ స్పూన్ పసుపు వేసి మరిగించి ఆ గోరువెచ్చని నీళ్లు తాగితే ఫీవర్ నుంచి ఉపశమనం కలుగుతుంది.