నేడు (ఆదివారం) దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష జరగనుంది. మొత్తం 18.72 లక్షల మంది వరకు దరఖాస్తు చేయగా ఏపీ నుంచి 68,022 మంది, తెలంగాణ నుంచి 73,808 మంది పరీక్ష రాస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించాలి. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత లోనికి అనుమతించరు. పరీక్షా కేంద్రాల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేయనున్నారు. లోహాలతో తయారు చేసిన ఉంగరాలు, ముక్కుపుడకలు, నెక్లెస్‌లు, చెవి పోగులు, వాచ్ తదితరాలు ధరించిన విద్యార్థులను అనుమతించరు. బూట్లు ధరించినా ప్రవేశం లేదు.