మెంతులలో అనేక ఔషధగుణాలు ఉంటాయి. మెంతి గింజల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయి. మధుమేహంతో బాధపడేవారు రోజూ మెంతుల నీటిని తాగితే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మెంతి నీటిని తయారు చేయడానికి, ఒక టీ స్పూన్ మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. విత్తనాలను జల్లెడ పట్టి, మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో నీటిని తాగితే మంచింది.