దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 709.96 పాయింట్ల లాభంతో 61,764.25 దగ్గర స్థిరపడగా, నిఫ్టీ 195.40 పాయింట్లు లాభపడి 18,264.40 దగ్గర ముగిసింది. సన్‌ఫార్మా, ఎల్అండ్టీ, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, NTPC, HCL టెక్, ఎంఅండ్ఎం, కొటాక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి.