దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 82 పాయింట్లు లాభపడి 61,843 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 18,313 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.99 వద్ద ట్రేడవుతోంది. టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నెస్లే, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, ఐటీసీ, ఎన్టీపీసీ కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.