ఐపీఎల్ టోర్నీలో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ పై 27 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగుల భారీ స్కోరు చేసింది. 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు చేసింది. రషీద్ ఖాన్ 79 పరుగులు, డేవిడ్ మిల్లర్ 41 పరుగులు, విజయ్ శంకర్ 29 పరుగులు చేసారు. ఆకాశ్ మధ్వల్ 3 వికెట్లు, పీయూశ్ చావ్లా, కార్తికేయ చెరో రెండు వికెట్లు తీశారు.