మేషం: మిత్రుల నుండి కొంత ఆసక్తి సమాచారం అందుతుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు.
వృషభం: ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. వ్యాపార ఉద్యోగాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
మిధునం: నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు.
కర్కాటకం: దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయం అందక ఇబ్బంది పడతారు. పాత ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
సింహం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. రావలసిన ధనం సకాలంలో అందక నిరాశ కలుగుతుంది. వ్యాపారాలలో శ్రమ అధికమవుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.
కన్య: నూతన వ్యక్తుల పరిచయాలు ఉపయోగపడతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్ధిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది.
తుల: నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. బంధు మిత్రులతో వివాదాలు తీరుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.
వృశ్చికం: సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పెరుగుతాయి. ధన పరంగా ఒడిదుడుకులు అధికమౌతాయి. అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగపరంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక మానసిక సమస్యలు కలుగుతాయి.
ధనస్సు: నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ప్రశాంతత కోసం దైవదర్శనం చేసుకోవడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
మకరం: కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితులు నుండి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నూతన వస్తు లాభాలు పొందుతారు. సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
కుంభం: బంధు మిత్రుల మాటలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అధిక శ్రమతో గాని పనులు పూర్తి కావు. ఇంటాబయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు కలిగే సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.
మీనం: కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.