బీట్‌రూట్ లో బీటాలైన్స్ అనే ఫైటోన్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. బీట్‌రూట్ లోని యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాల వల్ల కడుపులోని దీర్ఘకాలిక మంట పోతుంది. బీట్‌రూట్ తింటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకం, పేగు వ్యాధులు, పెద్దపేగు క్యాన్సర్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా జీవక్రియలను మెరుగుపరుస్తుంది. బీట్‌రూట్ లోని నైట్రేట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. బీట్‌రూట్‌లలో ఉండే డైటరీ నైట్రేట్ మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. బీట్‌రూట్‌లు తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి. బీట్‌రూట్ లో విటమిన్ బి6, సి, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ప్రొటీన్, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను దూరం చేయడంలో సహాయపడుతాయి.