నువ్వులు, బెల్లం కలిపి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వేయించిన నువ్వులు, బెల్లం కలిపి తింటే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందంటున్నారు. మధుమేహ బాధితులు దీన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు. రక్త హీనత ఉన్న వారు నువ్వుల లడ్డూను తింటే సమస్య పరిష్కారమవుతుందంటున్నారు. రోజూ 1 చెంచా నువ్వులు, బెల్లం కలిపి తింటే బరువు తగ్గుతారు. అంతే కాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందంటున్నారు.