ప్రస్తుతం అధిక రక్తపోటు సమస్య సర్వ సాధారణంగా మారిపోయింది. ఇంటి చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లిని తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉండడం సహా రోగ నిరోధక శక్తి పెరగడం, జట్టు, చర్మ సంరక్షణ కలుగుతుంది. అయితే, వెల్లుల్లిని ఉడికించకుండా నీటితో కలిపి తినాలి. బీపీ అకస్మాత్తుగా పెరిగితే అర గ్లాస్ నీటిలో నల్ల మిరియాల పొడి వేసి తాగితే ఉపశమనం లభిస్తుందంటున్నారు. ఉల్లిపాయలు, ఉసిరి తీసుకున్నా సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు.