వాస్తు ప్రకారం ఈశాన్యంలో కొన్నింటిని ఉంచకూడదని పండితులు పేర్కొంటున్నారు. ఇంట్లో ఈశాన్యంలో ఎప్పుడూ శుభ్రంగా ఉండాలని, టాయిలెట్ అస్సలు ఉండకూడదని చెబుతున్నారు. అలా ఉంటే అనారోగ్య సమస్యలు పెరగొచ్చంటున్నారు. వంట గది ఉన్నా కూడా మంచిది కాదు. ఈశాన్యం మూసి ఉన్నట్లుగా ఎలాంటి కట్టడం ఉండకూడదు. గదులు నిర్మించకూడదు. ఈశాన్యం వైపు లోపల, బయట మెట్లు ఉండకూడదు. బెడ్ రూమ్ కూడా ఉండకూడదు. అలా ఉంటే చెడు ఫలితాలు కలుగుతాయంటున్నారు.